: మోడీ ర్యాలీకి ఢిల్లీ మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు
బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ రేపు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న భారీ ర్యాలీకి ఢిల్లీ మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ ర్యాలీకి దాదాపు 50వేల పైన కార్యకర్తలు వస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు వేదిక వద్దకు చేరుకునేందుకు అదనంగా రైళ్ళు నడపనున్నట్టు మెట్రో సంస్ధ అధికారి తెలిపారు. వారికోసం అదనపు ట్రైన్లు, వాటికి అనుబంధంగా బస్సులు వేస్తామని, తిరుగు ప్రయాణ టికెట్లు కూడా ఇస్తామని, ఇంకా రైళ్ళ గమ్యస్థానాన్ని పెంచుతామని వెల్లడించారు. సాధారణంగా ఆదివారం రోజున ఢిల్లీ మెట్రో తక్కువ ట్రైన్లు నడుపుతుంది. కానీ, ర్యాలీ నేపథ్యంలో 26 ట్రైన్లను నడుపుతుందని బీజేపీ నేత విజేందర్ గుప్తా చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ మెట్రో డైరెక్టర్ తో సమావేశమై చర్చించామని గుప్తా తెలిపారు.