: వెయ్యిమంది కిరణ్ లు వచ్చినా ఏమీ చేయలేరు: కోదండరాం
సీఎం కిరణ్ పై ధ్వజమెత్తిన వారి జాబితాలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా చేరారు. మహబూబ్ నగర్లో బీజేపీ నిర్వహిస్తోన్న తెలంగాణ ప్రజా గర్జన సభలో ఆయన మాట్లాడుతూ, వెయ్యిమంది కిరణ్ లు వచ్చినా ఏమీ చేయలేరని, రాష్ట్ర విభజనను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం సాకారమవుతుందనడంలో ఎలాంటి సందేహాలు అవసరంలేదని చెప్పారు.