: అత్యాచారం కేసులో వైద్యపరీక్షలకు హాజరైన రాజస్థాన్ మంత్రి


35 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ మంత్రి బాబూలాల్ నాగర్ ఈ రోజు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. జైపూర్ లోని ఎస్ఎంఎస్ హాస్పిటల్ లో బాబూలాల్ పరీక్షలు చేయించుకున్నట్టు సీఐడీ క్రైం బ్రాంచ్ తెలిపింది. అతన్ని పరీక్షించిన వైద్యులు మంత్రి నుంచి వీర్యంతో పాటు ఇతర శ్యాంపిళ్లను తీసుకున్నారు. టెస్టులు పూర్తయిన తర్వాత బాబూలాల్ వెళ్లిపోయారు. మంత్రిపై కేసు నమోదైనప్పటికీ.. ఇంకా అరెస్ట్ చేయలేదు. కాకపోతే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News