: సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలి: కేసీఆర్


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దారినపోయే దానయ్యను సీఎం చేస్తే... ఇప్పుడు ఆయన అధిష్ఠానాన్నే ధిక్కరిస్తున్నారని... ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు గుర్తించాలని సూచించారు. రాష్ట్రపతి పాలన విధించైనా సరే తెలంగాణను ఏర్పాటు చేయాలని ప్రధానిని, కాంగ్రెస్ పార్టీని కోరారు. నిన్న సీఎం చెప్పిన లెక్కల్లో నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగినట్టు తేలిందని అన్నారు. సీమాంధ్రులు అక్రమంగా నీటిని తీసుకుపోతున్నా... తాము చూస్తూ మౌనంగా ఉండాలా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని తేలిపోయాక... సీఎం ఫైళ్ల మీద ఆగమేఘాల మీద సంతకాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కిరణ్ దోపిడీని బయటపెడతామని కేసీఆర్ తెలిపారు.

  • Loading...

More Telugu News