: సీఎం చిన్నప్పటినుంచే తొండి చేసేవారు: వివేక్
సీఎం కిరణ్ పై తెలంగాణ ప్రాంత నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా, ఎంపీ వివేక్ కూడా కిరణ్ పై మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎంకు చిన్నప్పటి నుంచే తొండి చేసే అలవాటుందని వ్యాఖ్యానించారు. పాఠశాల స్థాయి నుంచే ఓడిపోవడం ఆయన నైజంగా మారిందని ఎద్దేవా చేశారు. మానసిక స్థితి సరిగా లేని ఈ ముఖ్యమంత్రిని వెంటనే అరెస్టు చేయాలని సూచించారు. ఒక్క సర్పంచ్ ను కూడా గెలిపించే సత్తా లేని సీఎం ఇరు ప్రాంతాల ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.