: కాలిఫోర్నియాలో సమైక్యాంధ్ర ప్రదర్శన
రాష్ట్ర విభజన ప్రకటనకు వ్యతిరేకంగా అమెరికాలోని తెలుగువారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై వారు మండిపడుతున్నారు. ఈ క్రమంలో కాలిఫోర్నియాలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ, గత రెండు నెలలుగా సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నా కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాజీనామాలు చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరిగేదని వారు అభిప్రాయపడ్డారు. వారికి పొత్తులపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.