: చెన్నై ఎయిర్ పోర్టులో విషపూరితమైన తేళ్లు, సాలీళ్లు స్వాధీనం
అత్యంత విషపూరితమైన తేళ్లు, సాలీళ్లను చెన్నై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విదేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 6 పార్సిళ్లను సీజ్ చేశారు. వీటిలో 3 పార్శిళ్లు ఫిలిప్పైన్స్ కు, మరో 3 పార్శిళ్లు ఇటలీకి తరలించే ప్రయత్నం చేస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని సింగపూర్ ఎయిర్ లైన్స్ ద్వారా ఫిలిప్పైన్స్ కు, లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ద్వారా ఇటలీకి అక్రమ రవాణా చేస్తున్నారు. కాగా, పార్శిళ్లలో ఉంచిన తేళ్లు, సాలీళ్లు ప్రాణాలతోనే ఉన్నాయి. అయితే కస్టమ్స్ అధికారులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో పార్శిళ్ల మీద పేర్కొన్న అడ్రస్ లు తప్పని తేలింది. వివరాలను రాబట్టేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.