: ఢిల్లీలో మూడు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు
సమైక్యాంధ్ర ఉద్యమంలో రాయలసీమ విశ్వవిద్యాలయాల విద్యార్థి జేఏసీ కదం తొక్కుతోంది. అక్టోబర్ 2 నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్టు తెలిపింది. దీంతో పాటు డిసెంబర్ లో 10 లక్షల మందితో విద్యార్థి గర్జన ఉంటుందని విద్యార్థి జేఏసీ నేతలు వెల్లడించారు. ఈ రోజు కర్నూలులో రాయలసీమ విశ్వవిద్యాలయాల విద్యార్థి జేఏసీ సమావేశం జరిగింది. అనంతరం జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడారు.