: రాజీనామా నిర్ణయాలు ప్రజల కోరిక మేరకు తీసుకున్నవే: ఉండవల్లి


ప్రజాప్రతినిధులుగా ప్రజల అభీష్టాన్ని మన్నించి రాజీనామాలు చేస్తున్నామని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఆగస్టులోనే రాజీనామాలు చేసినప్పటికీ స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో మరోసారి స్పీకర్ కు రాజీనామాలు సమర్పించామని అన్నారు. తమకు సంబంధించినంత వరకు రాజీనామాలు ఆమోదింపజేసుకున్నట్టే అని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు కోరినట్టే రాజీనామా చేశామని అన్నారు. రాజీనామాల వల్ల ప్రజల మనోభావాలు అధిష్ఠానానికి తెలుస్తాయని, తద్వారా విభజన ప్రక్రియ ఆగుతుందని ఆయన అన్నారు.

విభజన ప్రక్రియ శరవేగంగా జరగకుండా ఆపడంలో తాము సఫలమయ్యామని ఆయన గుర్తుచేశారు. రాజీనామాలు చేయండని ప్రజలు కోరుతున్నారని అందుకే వ్యక్తిగతంగా, స్వచ్ఛందంగా, ఒత్తిడి లేకుండా రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. ఇక ఢిల్లీలో తమ పని పూర్తైందని ఇక ప్రజల్లోకి వెళతామని ఉండవల్లి స్పష్టం చేశారు. ప్రజల కోరిక మేరకు పార్లమెంటులో ఏం చేయాలనుకున్నామో అది పూర్తి చేశామని తెలిపారు. రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ ను కోరామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News