: కాపాడాల్సినవారే కాటేశారు


వాళ్ళు గ్రామరక్షకులు! తమ ఊరి రక్షణ కోసం గ్రామపెద్దలు ఎంపిక చేసిన యువకులు! పోలీస్ స్టేషన్ కి అనుబంధంగా పనిచేస్తారు. వారి విధి.. గ్రామంలో దొంగతనాలు, దారుణాలు జరగకుండా చూడడం. కానీ, వాళ్ళు విచక్షణ మరిచారు. తమ గ్రామానికే చెందిన మహిళపై అత్యాచారానికి తెగబడ్డారు. మణిపూర్ లో జరిగిందీ ఘటన. వివరాల్లోకెళితే.. ఈ నెల 21న ఆ మహిళ స్వగ్రామం దిస్లాండ్ కు తిరిగివస్తుండగా, ఆమెపై ఆరుగురు గ్రామరక్షకదళం సభ్యులు సామూహిక అత్యాచారం జరిపారు. ఆ సమయంలో బాగా తాగి ఉన్న వారు, ఒంటరిగా ఉన్న ఆమెను వేధించడమే గాకుండా, సమీపంలోని అడవిలోకి తీసుకెళ్ళి వంతులవారీగా బలాత్కరించారు.

ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు తన భర్తతో కలిసి ఆ ఆరుగురు కీచకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్టు చేయడమే కాకుండా, గ్రామరక్షక దళం నుంచి వారిని తొలగించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా వారికి సోమవారం వరకు రిమాండ్ విధించారు.

  • Loading...

More Telugu News