: సీఎం రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు: గుత్తా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతూ... సీమాంధ్రులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకుడు కావాలనుకుంటే... ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని గుత్తా సూచించారు.