: రాహుల్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా : మంత్రి డొక్కా
నేరచరిత్ర గల ప్రజాప్రతినిధులను అనర్హులను చేసే ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ఏకిభవిస్తున్నట్టు మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తనను ఎంతో బాధిస్తున్నాయని అన్నారు. రాజీనామాలు విభజన సమస్యకు పరిష్కారం చూపలేవని అభిప్రాయపడ్డారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న రాష్ట్ర పరిణామాలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని తెలిపారు.