: డెంగీతో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ యువనటుడు రణ్ వీర్ సింగ్ డెంగీ జ్వరంతో ఆసుపత్రిలో చేరాడు. పశ్చిమబెంగాల్ లోని దుర్గాపూర్ లో ఒక చిత్రం షూటింగ్ లో ఉండగా ఆయనకు జ్వరం సోకినట్టు సమాచారం. చిత్ర యూనిట్ కు నష్టం కలుగకూడదనే ఉద్దేశ్యంతో జ్వరంతోనే షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసి, ముంబై వచ్చి ఆసుపత్రిలో చేరాడట.