: శ్రీనివాసన్ ఎన్నికైనా బాధ్యతలు స్వీకరించడానికి వీల్లేదు : సుప్రీం కోర్టు


బాధ్యతలకు దూరంగా ఉన్న బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. రానున్న బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలలో శ్రీనివాసన్ ఎన్నికైనా... ఐపీఎల్ లో జరిగిన అవినీతికి సంబంధించిన కేసులో ఆయన కడిగిన ముత్యంలా బయటపడిన తర్వాతే బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుందని హుకుం జారీ చేసింది. జస్టిస్ ఏ.కే.పట్నాయక్, జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. అయితే ఆదివారం (29వ తేదీన) జరగనున్న బీసీసీఐ వార్షిక సమావేశాలకు శ్రీనివాసన్ హాజరు కావొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ రెండేళ్ల బాధ్యతలు ఈ నెలాఖరుతో ముగుస్తున్నాయి. మరోసారి ఈ కీలకమైన బాధ్యతలు చేపట్టడానికి శ్రీనివాసన్ అడుగులు వేస్తున్నారు. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం అతడి ఆశలపై నీళ్లు చల్లింది.

  • Loading...

More Telugu News