: అక్టోబర్ 2 లోగా తెలంగాణ ప్రకటన లేకుంటే సకలజనుల సమ్మె: పీఆర్టీయూ
అక్టోబర్ 2 లోగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ప్రకటించకపోతే మరో సకలజనుల సమ్మెకు సిద్ధమని పీఆర్టీయూ స్పష్టం చేసింది. అక్టోబర్ 2న ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న తెలంగాణ ఏర్పాటుకై ఉపాధ్యాయగర్జన పోస్టర్ ను హైదరాబాద్ లోని నారాయణగూడ పీఆర్టీయూ కార్యాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె విరమిస్తారని వారు తెలిపారు.