: యూపీఏ నిర్ణయంపై ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ
నేరచరిత ప్రజాప్రతినిధుల్ని చట్టసభల్లో ప్రవేశానికి అర్హులను చేస్తూ యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. నేరచరితులను ఎలా సమర్ధిస్థారంటూ ఆయన కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి చట్టాలు చేటు తెస్తాయని, దేశ భవిష్యత్తుకు అవి ప్రమాదకరంగా పరిణమిస్తాయని ఆయన అన్నారు. నేరచరిత ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అనర్హులన్న సుప్రీం తీర్పును రాహుల్ గాంధీ సమర్ధించారు. అంతటితో ఆగకుండా నేరచరితులైన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడకుండా తీసుకొచ్చే ఆర్డినెన్స్ సరికాదని తన వ్యక్తిగత అభిప్రాయమని రాహుల్ గాంధీ అన్నారు.