: సంజయ్ దత్ ప్రదర్శన వాయిదా


ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ గురువారం నిర్వహించాల్సిన స్టేజి ప్రదర్శన వాయిదా పడింది. జైలు సిబ్బందికి నిధులు సేకరించాలనే సదుద్దేశంతో సంజయ్ దత్ తో కలిసి జైలు అధికారులు ఈ ప్రదర్శనకు నాంది పలికారు. కానీ భద్రత కారణాల రీత్యా జైలు అధికారులు ప్రదర్శనను వాయిదా వేశారు. కొన్ని రోజుల తరువాత స్టేజ్ షో ఉంటుందని తెలిపిన మహారాష్ట్ర జైళ్ల శాఖ చీఫ్ మీరన్ బొర్వాన్కర్, తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. సంజూ భాయ్ షోను తిలకించడానికి అభిమానులు పోటీ పడ్డారని తెలిపారు. ఈ షోకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్, హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ లు వస్తారని భావించారు. ఈ షోలో సంజయ్ దత్ మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలోని సన్నివేశాలతో పాటు డాన్స్ కూడా చేయనున్నాడు.

  • Loading...

More Telugu News