: 'అత్తారింటికి' సినిమాకి సమైక్యసెగ
'అత్తారింటికి దారేది' సినిమాకి సమైక్యసెగ తగిలింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆ సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ వద్ద విశాలాంధ్ర మహాసభ జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఆందోళనకారులు జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ తొలి ప్రదర్శనను అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన వచ్చిన తరువాతే చిరంజీవి కుటుంబసభ్యుల సినిమాలను ఆదరిస్తామని, లేని పక్షంలో వారి సినిమాలను అడ్డుకుని తీరుతామని వారు స్పష్టం చేశారు.