: సిరియాలో తనిఖీలు చేపట్టనున్న ఐక్యరాజ్యసమితి బృందం


ఐక్యరాజ్య సమితికి చెందిన తనిఖీ బృందం మళ్లీ సిరియా చేరుకుంది. ఈ బృందం సిరియాలోని 'ఖాన్ అల్ అసాల్' పట్టణంపై జరిగిన రసాయన దాడిపై దర్యాప్తు జరపనుంది. స్వీడన్ కు చెందిన 'ఆకే సెల్ స్టామ్' ఆధ్వర్యంలో తనిఖీలు జరగనున్నాయి.

మార్చి నెల 19న సిరియా అధ్యక్షుడు అసాద్ కు చెందిన సేనలు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్ అసాల్ పట్టణంపై రసాయనిక ఆయుధాలు ప్రయోగించారని అమెరికాతో పాటు అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. ఒకానొక సమయంలో సిరియాపై యుద్ధం చేయడానికి ఒబామా సిద్ధమయ్యారు. అయితే రష్యా జోక్యం చేసుకోవడంతో యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. మరోవైపు సిరియా అధ్యక్షుడు అసాద్ సేనలు కొనసాగిస్తున్న దాడులకు తాళలేక వేలాది మంది సిరియన్లు దేశం వదిలి పొరుగునున్న ఇరాక్ తరలిపోతున్నారు. వేలాదిగా చేరుకుంటున్న సిరియన్ శరణార్థుల కోసం ఇరాక్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

  • Loading...

More Telugu News