: త్వరలో గుంటూరు - రేపల్లె మధ్య కొత్త రైలు
త్వరలోనే గుంటూరు - రేపల్లె మధ్య మరో ప్యాసింజర్ రైలును ప్రారంభించనున్నట్టు గుంటూరు రైల్వే డీఆర్ ఎం ప్రసాద్ తెలిపారు. ఈ రోజు ఉదయం జర్మన్ టెక్నాలజీతో రూపొందించిన కొత్త రైలు ట్రయల్ రన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైలు ప్రయాణ వేళలను త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపారు.