: కిషన్ రెడ్డితో భేటీ అయిన కోదండరాం
బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం భేటీ అయ్యారు. వీరి భేటీ భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరుగుతోంది. ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్ కూడా హాజరయ్యారు. హైదరాబాద్ లో ఈ నెల 29న జరుగనున్న 'సకలజన భేరి' సభ ఏర్పాట్లు, నిర్వహణపై చర్చిస్తున్నట్టు సమాచారం.