: జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ధర్నా
విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా చేపట్టారు. గత రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేసిన ఉద్యోగులు ఈ రోజు ధర్నా చేపట్టారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.