: ఆలయం కూల్చివేత... పరిస్థితి ఉద్రిక్తం
హైదరాబాద్ కార్ఖానాలోని కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది మునీశ్వర ఆలయాన్ని కూల్చడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వీరికి తెరాస, బీజేపీ తోడవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళితే... ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కంటోన్మెంట్ లోని మడ్ మైదానంలో చెట్టుకూలి మునీశ్వర ఆలయంపై పడటంతో... ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది. దీంతో స్థానికులు ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. అయితే దీనికి అంగీకరించని కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది ఆలయాన్ని కూల్చివేశారు. దీంతో గొడవ ప్రారంభమైంది.