: నేడు గూగుల్ రారాజు పుట్టినరోజు


ఈవేళ మనలో చాలామంది గూగుల్ మీద ఆధారపడిపోయారు. ఏ చిన్న సమాచారం కావాలన్నా గూగుల్ నే అడుగుతాం. అది ఠక్కుమని సమాధానం ఇస్తుంది. మనిషి ఆలోచనలు ఎంత ఉన్నతంగా అభివృద్ధి చెందాయో అనడానికి, చూపడానికి గూగుల్ అతిపెద్ద నిదర్శనం.

1998 సెప్టెంబర్ 27న మన ముందుకొచ్చిన గూగుల్ ను.. లారీ పేజ్, సెర్జి బ్రిన్ అనే ఇద్దరు వ్యక్తులు కాలిఫోర్నియాలోని మెల్నో పార్క్ గ్యారేజ్ లో అభివృద్ధి చేశారు. అప్పటినుంచి ప్రపంచంలో ప్రతిఒక్కరికీ అత్యంత ఇష్టమైన సెర్చ్ ఇంజిన్ గా మారింది. ప్రస్తుతం గూగుల్ కు ప్రపంచంలో నలభైచోట్ల డెబ్భై కార్యాలయాలు ఉన్నాయి. నేడు ఈ గూగుల్ రారాజు 15వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా గూగుల్ పేజ్ విభిన్నమైన డూడుల్ తో తనకు తాను శుభాకాంక్షలు చెప్పుకుంది.

  • Loading...

More Telugu News