: రోడ్డు ప్రమాదంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ మృతి
నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ రామారావు మృతి చెందారు. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ దుర్ఘటనలో మున్సిపల్ కమిషనర్ తో పాటు మరో ఇద్దరు కూడా మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.