: ఇది చాలా బుల్లి కంప్యూటర్‌!


ప్రపంచంలోనే అతి బుల్లి కంప్యూటర్‌ని చూశారా... అలాంటి కంప్యూటర్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. సెడ్రిక్‌ అనే పేరుగల బుల్లి కంప్యూటర్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది బుల్లిదే అయినా సమర్ధవంతమైన యంత్రాలను తయారుచేయగలదట. ఈ బుల్లి కంప్యూటర్‌ను తయారుచేయడానికి శాస్త్రవేత్తలు సరికొత్త ఆధునిక పద్ధతులను ఉపయోగించారు. ఈ విధానాన్ని ఉపయోగించడం వల్ల అత్యంత వేగంగా, తక్కువ విద్యుత్తుతో పనిచేసే కొత్తతరం ఎలక్ట్రానిక్‌ పరికరాలను తయారుచేయడానికి చక్కటి మార్గం ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కార్బన్‌ నానోట్యూబ్‌లు (సీఎన్‌టీ) శక్తి సామర్ధ్యాలను ఉపయోగించుకోవడానికి శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల నేపధ్యంలో స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పూర్తిగా కార్బన్‌ నానోట్యూబ్‌లతో కూడిన కంప్యూటర్‌ను రూపొందించారు. ఈ పరిశోధనకు భారత సంతతికి చెందిన సుభాశిష్‌ మిత్రా నేతృత్వం వహించడం విశేషం. ఈ శాస్త్రవేత్తల బృందం 99.5 శాతం మేర సరళరేఖలో ఉన్న సీఎన్‌టీలను తయారుచేశారు. మిగిలిన 0.5 శాతాన్ని ఏమార్చే ఒక తెలివైన ఆల్గోరిథమ్‌ను రూపొందించారు.

అలాగే మరో లోపాన్ని కూడా వారు అధిగమించారు. లోహపు సీఎన్‌టీలను తొలగించారు. ఇవి సెమీకండక్లర్‌గా ఉండడానికి బదులు విద్యుత్‌ గ్రాహకాలుగా ఉంటాయి. వీటిని తొలగించడానికి శాస్త్రవేత్తలు మంచి సీఎన్‌టీలను స్విచ్ఛాఫ్‌ చేశారు. తర్వాత చెడు సీఎన్‌టీలోకి భారీగా విద్యుత్తును సరఫరా చేశారు. ఫలితంగా అవి అమితంగా వేడెక్కిపోయి ఆవిరైపోయాయి. చివరికి పూర్తిస్థాయిలో పనిచేసే సర్క్యూట్‌ను సిద్ధం చేశారు. ఈ రెండంచెల విధానాన్ని ఇంపర్ఫెక్షన్‌ ఇమ్యూన్‌ డిజైన్‌గా పిలుస్తున్నారు.

ఈ డిజైన్‌ను ఉపయోగించిన శాస్త్రవేత్తలు సెడ్రిక్‌ అనే ప్రాధమిక కంప్యూటర్‌ను రూపొందించారు. ఇందులో 178 ట్రాన్సిస్టర్లను ఉపయోగించారు. విశ్వవిద్యాలయంలోని చిన్నపాటి చిప్‌ తయారీకి కర్మాగారంపైనే ఆధారపడాల్సి ఉండడం వల్ల ఇంత తక్కువ సంఖ్యలో ట్రాన్సిస్టర్లను వాడారు. సెడ్రిక్‌ ప్రాధమిక స్థాయి ప్రోటోటైప్‌ కంప్యూటరే అయినాకూడా నేటి సిలికాన్‌ మోడల్‌కన్నాకూడా చాలా చిన్నదిగా, సమర్ధవంతమైన యంత్రాలను రూపొందించేందుకు మార్గం సుగమం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News