: ఫిజీ పోలీస్ బాస్ భారతసంతతి వ్యక్తి
ఫిజీ దేశంలో పోలీస్ బాస్ గా భారత సంతతికి చెందిన రవి నారాయణ్ ను నియమించారు. గురువారం ఆ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. రవినారాయణ్ ను పోలిస్ బాస్ గా ఎంపిక చేస్తూ డిఫెన్స్ జోకెతాని కొకనసిగ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు రవి నారాయణ్ ఫిజీకి డిఫ్యుటీ కమీషనర్ గా సేవలందిస్తున్నారు. కొత్త కమీషనర్ ను ఎంపిక చేసేవరకు రవినారాయణ్ పదవీబాధ్యతలు స్వీకరించనున్నారు.