: ఉప్పల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా ప్రాక్టీసు షురూ


రెండో టెస్టుకు సన్నద్ధమవుతున్న భారత్, ఆస్ట్రేలియా జట్లు ఈరోజు ముమ్మర సాధనలో మునిగితేలాయి. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరుజట్లు తీవ్రంగా ప్రాక్టీసు చేశాయి. భారత ఆటగాళ్లు పేస్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ప్రాధాన్యమివ్వగా, ఆసీస్ ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొంటూ బిజీగా కనిపించారు.

నిన్న హోటల్ గదులకే పరిమితమైన ఇరు జట్ల ఆటగాళ్లు ఈ రోజు మైదానంలో ఉల్లాసంగా కనిపించారు. కాగా, నాలుగు టెస్టుల సిరీస్ లో రెండో మ్యాచ్ మార్చి 2 న మొదలవుతుంది. ఈ మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. 

  • Loading...

More Telugu News