: ముజఫర్ నగర్ అల్లర్ల ఘటనపై విచారణ ప్రారంభం


ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు విభాగం (ఎస్ఐసి) విచారణ చేబట్టింది. ఈ నెలలో చోటుచేసుకున్న ఈ అల్లర్లలో 49 మంది చనిపోగా, పలువురు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై మొత్తం 106 కేసులు నమోదవగా, 408 మంది పేర్లను ఈ కేసుల్లో నిందితులుగా పేర్కొన్నారు. రెండు పోలీస్ ప్రత్యేక బృందాలు ఈ కేసులను విచారించనున్నాయి. ఈ ఘటనకు కారకులైన బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసులు నమోదవగా.. నలుగురు అరెస్టైన సంగతి తెలిసిందే. అల్లర్ల సమయంలో వందల కుటుంబాలు నిలువ నీడలేకుండా రోడ్డునపడ్డారు.

  • Loading...

More Telugu News