: సమైక్యాంధ్ర రథ యాత్ర ప్రారంభం
రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో రథయాత్ర ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో ఐదు రోజులపాటు ఈ రథయాత్ర కొనసాగనుంది. రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాలను ఉపాధ్యాయులు పల్లె పల్లెకు తిరిగి వివరించనున్నారు. ఈ యాత్రను జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ పెంచల్ రెడ్డి, డీఆర్వో రామిరెడ్డి జెండా వూపి ప్రారంభించారు.