: సీఎం పెవిలియన్ దారి పట్టే సమయం ఆసన్నమైంది : హరీష్ రావు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెవిలియన్ దారి పట్టే సమయం ఆసన్నమైందని తెరాస నేత హరీష్ రావు అన్నారు. తెలంగాణ వారిని ఓడించడానికి ఆయన ఎన్ని మ్యాచ్ ఫిక్సింగ్ లు చేసినా... ఇక్కడి ప్రజలు దాన్ని విజయవంతంగా తిప్పి కొట్టారని ఎద్దేవా చేశారు. ఈ రోజు ఉదయం రాజ్యసభ టీవీలో... "చివరి బంతి వరకు మ్యాచ్ ముగియదు" అన్న సీఎం వ్యాఖ్యలతో ఆయన విభేదించారు. ఆయన అనుకుంటున్న చివరి బంతి... పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడమేనని అన్నారు.