: పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలంటూ ఏబీవీపీ ప్రదర్శన
పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ భారీ ప్రదర్శన నిర్వహించింది. హైదరాబాద్ లోని హస్తినాపురం నుంచి బీఎస్ రెడ్డి నగర్ వరకు ప్లకార్డులతో తెలంగాణ నినాదాలు చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ర్యాలీ చేశారు. సీమాంధ్ర వాసులు ఉద్యమాలు మాని తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని ఏబీవీపీ నాయకుడు వెంకట్ రెడ్డి కోరారు.