: రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చెప్పింది ప్రతిపక్షాలు కాదా? : శైలజానాథ్
రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చెప్పింది ప్రతిపక్షాలు కాదా? అని మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలన్నీ ఓట్లు, సీట్ల గురించే మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకించడం ద్వారా రాష్ట్ర విభజనను అడ్డుకోవచ్చన్న ఆయన, అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల సభ్యులు సభలో తీర్మానాన్ని ఓడించాలని ఆయన కోరారు.