: ఒప్పందంలో భాగమే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల రాజీనామా: పయ్యావుల
జగన్ కు బెయిల్ ఒప్పందంలో భాగమే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల రాజీనామాల ఆలోచన అని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ సమైక్యతీర్మానం ఓడించేందుకే స్పీకర్ కు రాజీనామా చేస్తామని వైఎస్సార్ సీపీ చెప్పిందన్నారు. ప్రజలకు వెన్ను పోటు పొడిచేందుకు వైఎస్సార్ సీపీ సిద్థమైందని ఆయన మండిపడ్డారు.