: ఆసీస్ ఆటగాడు హెన్రిక్స్ మ్యాచ్ ఫీజులో కోత
నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించాడని ఆస్ట్రేలియా యువ ఆటగాడు మోజెస్ హెన్రిక్స్ పై జరిమానా విధించారు. చెన్నై టెస్టు సందర్భంగా హెన్రిక్స్ తన హెల్మెట్ పై తయారీదారు లోగోను ధరించాడని, అది ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినట్టేనని మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తెలిపారు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్టు బ్రాడ్ పేర్కొన్నారు.