: సమైక్య తీర్మానం తర్వాతే రాజీనామాలు ఆమోదింపజేసుకుంటాం: శోభానాగిరెడ్డి


తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు పార్టీ అధ్యక్షుడు జగన్ తో భేటీ అయిన తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానాన్ని పెట్టి చర్చించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయా పార్టీల నేతల వైఖరేంటో బయటపడుతుందని తెలిపారు. తక్షణమే తమ రాజీనామాలను ఆమోదింపజేసుకునే ఆలోచనను విరమించుకుంటున్నామని అన్నారు. అసెంబ్లీలో సమైక్యాంధ్ర తీర్మానాన్ని గెలిపించుకున్న తర్వాతే రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని శోభ తెలిపారు.

రాజీనామాలపై కాంగ్రెస్ డ్రామాలాడుతోందని... విభజన ప్రక్రియను కొనసాగిస్తూనే రాజీనామాలు వద్దంటోందని శోభానాగిరెడ్డి దుయ్యబట్టారు. ప్రతిపక్షనేతలా వ్యవహరిస్తూ సీఎం రాజకీయ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. బొత్స, కిరణ్ ల వైఖరేంటో అసెంబ్లీ సాక్షిగా తెలుస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News