: హ్యాకింగ్ బారిన సల్మాన్, షారుక్, సచిన్ ఆదాయ పన్ను అకౌంట్లు!


ఇంటర్నెట్ సౌలభ్యం ఎంత పెరిగిందో అంతే క్రమంలో ముప్పు కూడా పొంచి ఉందన్న విషయం క్రమక్రమంగా అవగతమవుతోంది. నెట్ లో అకౌంట్లను హ్యాక్ చేసే సైబర్ క్రిమినల్స్ సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్.. క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ ఆదాయపన్ను అకౌంట్లు హ్యాకింగ్ బారిన పడ్డాయి. నోయిడాకు చెందిన 22 సంవత్సరాల కె. సంచిత్ అనే సిఏ (చార్టెర్ అకౌంటెంట్) విద్యార్ధి వీరి అకౌంట్లను హ్యాక్ చేసినట్లు ముంబయి క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ హిమాంశు రాయ్ తెలిపారు.

జున్ 22వ తేదీన సల్మాన్, షారుక్ ఖాతాలను.. 24, 28న ధోనీ అకౌంటును, జులై 4న సచిన్ ఖాతాను ఆ విద్యార్ధి ఓపెన్ చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని చెప్పారు. దాంతో, అతని నుంచి కంప్యూటర్, హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కేసు కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్ధి నోయిడాకు చెందిన చిరు వ్యాపారి కుమారుడని, అక్కడే ఓ కంపెనీలో తన ఆర్టికల్ షిప్ చేస్తున్నట్లు తెలిపారు. అత్యుత్సాహంతో ఇలా చేసినట్లు చెప్పాడన్నారు.

ఆగస్టులో వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఆదాయపన్ను అకౌంటును ఓ అమ్మాయి హ్యాక్ చేసిన ఉదంతంపై దర్యాప్తు చేస్తుండగా ఈ విషయాలు తెలిశాయని కమిషనర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News