: సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్
తన తండ్రి సమాధిని సందర్శించుకోవడానికి అనుమతించాలంటూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికోసం అక్టోబరు 1,2 తేదీల్లో ఇడుపులపాయ వెళ్లడానికి అనుమతివ్వాలని కోర్టును అభ్యర్థించారు. అలాగే అక్టోబర్ 4న గుంటూరులో నిర్వహిస్తున్న రైతు ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతించాలని విన్నవించుకున్నారు. జగన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసేటప్పుడు... హైదరాబాద్ వదిలి వెళ్లరాదని కోర్టు షరతు విధించిన సంగతి తెలిసిందే.