: సమైక్యవాద పార్టీలతో కలసి ఉద్యమిద్దాం: జగన్


సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలని జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ రోజు జగన్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. సమైక్యాంధ్రకు మద్దతిస్తున్న పార్టీలతో కలసి పనిచేద్దామని అన్నారు. అంతే కాకుండా కాంగ్రెసేతర లౌకికవాద పార్టీలతో కలసి పనిచేద్దామని సూచనప్రాయంగా తెలిపారు. దీనికి తోడు జాతీయస్థాయిలో వైఎస్సార్సీపీ వైఖరి ఎలా ఉండాలన్న దానిపై ఎమ్మెల్యేలకు వివరించారు. ఈ సమావేశానంతరం మరికాసేపట్లో వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

  • Loading...

More Telugu News