: అంగారకుడిని చుట్టిరానున్న నవ దంపతులు
కొంత మంది అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఓ పారిశ్రామిక వేత్త కలిసి ఓ మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 2018 నాటికి అంగారక గ్రహంపైకి నూతన వధూవరులను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారు గ్రహ ఉపరితలంపై కాలుమోపకుండా, అంగారక వాతావరణంలో ప్రవేశించి, వెంటనే తిరిగి వచ్చేస్తారని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
పారిశ్రామిక వేత్త డెన్నిస్ టిటో చేపట్టే ఈ ప్రాజెక్టులో నాసా జోక్యం ఉండబోదు. ఈ మిషన్లో దంపతులకు కావలసిన దుస్తులు, ఆహారం, నీరు అందుబాటులో ఉంటాయనీ, నూతన జంట వెళ్లేందుకు ప్రయివేటు రాకెట్ ను ఉపయోగిస్తారనీ ఈ ప్రాజక్టు సభ్యుడు మెక్ కెల్లమ్ చెప్పారు.