: ఇదో పెద్ద పాలపుంత


పాలపుంతలో అతిపెద్దదిగా చెబుతున్న ఒక పాలపుంతను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆకాశంలో ఇప్పటివరకూ కనుగొన్న వాటికన్నా కూడా ఇది అతిపెద్ద పాలపుంత అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పాలపుంతలో పెద్ద సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయని, సాంద్రత కూడా ఎక్కువగానే ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

అమెరికాలోని మిచిగన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త జే స్ట్రేడర్‌ నేతృత్వంలో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం అంతరిక్షంలో ముందెన్నడూ లేనివిధంగా అత్యంత దట్టమైన సాంద్రతతో కూడిన పాలపుంతను గుర్తించారు. ఈ పాలపుంత భారీ సంఖ్యలో నక్షత్రాలను కలిగివుంది. ఇది మన పాలపుంతకు సుమారు 5.4 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎం60-యూసీడీ1గా వ్యవహరిస్తున్న ఈ పాలపుంత విర్గో నక్షత్రవీధుల సమూహంలో గుర్తించారు. ఇతరత్రా ఏ నక్షత్రవీధితో పోల్చుకున్నా ఇది అత్యధిక సాంద్రతతో కూడివుందని స్ట్రేడర్‌ చెబుతున్నారు. దీని మధ్యలో ఉన్న భారీ కాలబిలం ఈ నక్షత్రవీధి ప్రత్యేకతను వెల్లడించింది. నాసా హబుల్‌ అంతరిక్ష టెలిస్కోప్‌ ద్వారా శాస్త్రవేత్తలకు దీని ఆచూకీ చిక్కింది. నాసాకు చెందిన చంద్రా ఎక్స్‌ అబ్జర్వేటరీ, కెక్‌10 మీటర్‌ వంటి టెలిస్కోపులతో శాస్త్రవేత్తలు దీనిపై పరిశీలన జరిపారు.

  • Loading...

More Telugu News