: స్కార్చర్స్ ను మట్టికరిపించిన ఒటాగో వోల్ట్స్
చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో ఒటాగో వోల్ట్స్ జట్టు 62 పరుగుల తేడాతో పెర్త్ స్కార్చర్స్ ను మట్టికరిపించింది. జైపూర్లో ఈ సాయంత్రం జరిగిన మ్యాచ్ లో తొలుత ఒటాగో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 242 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో స్కార్చర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేశారు. ఆ జట్టులో కార్ట్ రైట్ (69 నాటౌట్) ఫిఫ్టీ సాధించాడు.