: బంగ్లా యుద్ధ నేరస్థుడికి మరణశిక్ష


1971 బంగ్లాదేశ్ యుద్ధ నేరాల కేసులో జమాతే-ఈ-ఇస్లామిక్ పార్టీ ఉపాధ్యక్షుడు 'దెల్వర్ హుస్సేన్ సయీద్' కు ఢాకా ప్రత్యేక ట్రిబ్యూనల్ మరణశిక్ష విధించింది. ఈ మేరకు ట్రిబ్యూనల్ గురువారం తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో సయీద్ కు మరణశిక్ష విధించాలంటూ ఎప్పటినుంచో డిమాండు చేస్తున్న వేలాదిమంది బంగ్లాదేశీయులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన సమయంలో జరిగిన యుద్ధ నేరాలు, నరమేథం, అత్యాచారాలు వంటి ఆరోపణలపై 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో సయీద్ ని నిందితుడుగా గుర్తించారు.

2010లో కేసు నమోదుచేసి, అదే సంవత్సరం జూన్ 29న బంగ్లాదేశ్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పలువురు సాక్షులను విచారించగా, ఈ నేరాలకు ముఖ్య కారకుడు సయీదేనని, ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. అప్పటినుంచి న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగా ఇప్పటికి తీర్పు వచ్చింది. అయితే బంగ్లాదేశ్ లో ప్రధాన సంకీర్ణ పార్టీ అయిన ఇస్లామిక్.. యుద్ధ సమయంలో పలువురిని అణచివేతకు గురిచేశారన్న ఆరోపణలను ఖండించింది. రాజకీయ ప్రాబల్యం వల్లే తమపై ఇలాంటి చర్యలు తీసుకున్నారని విమర్శించింది. 

  • Loading...

More Telugu News