: రాజ్యాధికారం దిశగా బీసీలు ఉద్యమించాలి: కృష్ణయ్య
బీసీలు రాజ్యాధికారం దిశగా ఉద్యమించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఎన్నికైన బీసీ సర్పంచులు బీసీ సంఘాలను కలుపుకుని సుపరిపాలన అందించాలని ఆయన సూచించారు.