: సైన్యం కోసం ప్రత్యేక వేతన సంఘం
దేశ రక్షణ కోసం అహర్నిశలు పాటుపడే సైనికులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం నియామకానికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఈ అంశం తెరమీదకు వచ్చింది. త్రివిధ దళాలకు ప్రత్యేక వేతన సంఘం ఇప్పటివరకు లేదు. మిలిటరీ, పౌర ఉద్యోగుల మధ్య జీతాల్లో ఉన్న వ్యత్యాసాన్ని రూపుమాపే ప్రయత్నం జరగాలని త్రివిధ దళాధిపతులు గత ఏడాది రక్షణ మంత్రి ఆంటోనీకి లేఖ రాశారు. ఇదే విషయమై ఆంటోనీ ప్రధానమంత్రికి లేఖ రాశారు. దీంతో, మిలిటరీ ఉద్యోగుల డిమాండ్లను పరిశీలించడానికి ప్రధాని నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేశారు. ఈ మేరకు ప్రత్యేక వేతన సంఘాన్ని నియమిస్తామని త్రివిధ దళాల్లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది.