: 'సచిన్..కరీనా..దీపికా.. ఎవరూ అక్కర్లేదు.. మా పేరు చాలు'


సచిన్ టెండూల్కర్, కరీనా కపూర్, దీపికా పదుకొనే, సైఫ్ అలీఖాన్ వీళ్లంతా గోవా పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేందుకు ముందుకు వస్తున్నారు. కానీ గోవాకు వీరెవరూ అక్కర్లేదని, తమ రాష్ట్రం పేరే తమకు బ్రాండ్ అంబాసిడర్ అని ఆ రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి దిలీప్ పరులేకర్ తెలిపారు. గోవానే ఓ పెద్ద బ్రాండ్ అనీ, సెలబ్రిటీ అనీ, దానికి ప్రత్యేకంగా ప్రచారకర్తలు అవసరం లేదని మంత్రి అన్నారు. పలు మార్కెటింగ్ ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని.. సచిన్, దీపిక, సైఫ్ దంపతులు.. ఇలా పలువురు గోవాకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేందుకు సిద్ధపడ్డారని ఆయన తెలిపారు. అయితే తమ ప్రభుత్వానికి మాత్రం ఎవరితోనూ ఒప్పందం చేసుకునే ఆలోచన లేదన్నారు. గతంలో నటి ప్రాచీదేశాయ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా గోవా నియమించుకుంది.

  • Loading...

More Telugu News