: ఈనెల 28 నుంచి రాష్ట్రస్థాయి హిందూ సమ్మేళనం
హైదరాబాదు నగరంలో ఈ నెల 28,29 తేదీల్లో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు హిందూ జనజాగృతి సమితి తెలిపింది. హిందూ ధార్మికతకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమ్మేళనంలో చర్చించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుంచి 140 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. హిందూ సంస్కృతిని పెంపొందించే విధంగా యువతకు ఇచ్చే మార్గదర్శకాలపై చర్చిస్తారన్నారు.