: కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారం
మహారాష్ట్రలోని వాజేశ్వరిలోని అకొలి గ్రామానికి చెందిన గిరిజన మహిళ సోమవారం సాయంత్రం గ్రామశివారులో ఒంటరిగా వెళుతుండడాన్ని గమనించిన ఐదుగురు కీచకులు.. ఆమెను కత్తితో బెదిరించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఇందులో ముగ్గురు నిందితులు బాధితురాలి స్వగ్రామానికి చెందినవారు కాగా, మరో ఇద్దరు సమీప గ్రామానికి చెందిన వారు. ఘటన జరిగిన అనంతరం గిరిజన మహిళ కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న 48 గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిని సాగర్ హదల్, సంజయ్ అర్నాడే, మోహన్ కథక్, జగదీష్ గవిద్ లుగా గుర్తించారు. మరో నిందితుడు వినోద్ కుమార్ పరారీలో ఉన్నాడు అతని ఆచూకీ లభించలేదు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.