: ఒక్కటీకాతో అన్ని ఫ్లూలు దూరం!


ఫ్లూ అనే పేరు కలిగిన జబ్బుల్లో బర్డ్‌ ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ, ఇంకా మరేదైనా కొత్త రకం ఫ్లూ ఇలా పలురకాలైన ఫ్లూ జబ్బులు వస్తున్నాయి. ఇలాంటి జబ్బులకు ఒకే టీకాను రూపొందించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ కొత్తరకం ఫ్లూ టీకాను వివిధ రకాలైన ఫ్లూ వైరస్‌లనుండి రక్షణ కల్పించేలా తయారుచేయడానికి శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు.

కొంతమందికి తీవ్రస్థాయి అనారోగ్యం నుండి నిరోధకత ఎందుకు ఉంటోందనే దిశగా పరిశీలించేందుకు 2009లో ఫ్లూ వ్యాప్తిపై ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో శరీరంలో సీడీ8 టీ కణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా ప్రేరేపించే టీకాను ఇవ్వడం ద్వారా ఫ్లూ వైరస్‌ను నివారించవచ్చని గుర్తించారు. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త నేతృత్వంలోని ఈ అధ్యయన బృందం రూపొందించిన ఈ సార్వత్రిక టీకా పక్షులు, పందులనుండి మనుషులకు వ్యాపిస్తున్న కొత్తరకాలైన ఫ్లూ జబ్బులను అడ్డుకుంటుందని భావిస్తున్నారు. కాలం మారుతున్న కొద్దీ కొత్త రకాలైన ఫ్లూ జబ్బులు పుట్టుకొస్తున్నాయని, వీటిలో కొన్ని ప్రాణాంతకంగా మారుతున్నాయని, అలాకాకుండా అన్ని రకాలైన ఫ్లూ జ్వరాలతో పోరాడేందుకు ఒక సార్వత్రిక టీకా అవసరం ఎంతైనా ఉందని ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్‌ అజిత్‌ లాల్వానీ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News