: బిపి కంట్రోల్‌కు కొత్త క్లిప్‌


చికిత్స చేయించుకున్నా కూడా బీపీ కంట్రోల్‌ కావడంలేదా... అలాంటి వారికి క్లిప్‌లాంటి ఒక సరికొత్త పరికరాన్ని ఆపరేషన్‌ ద్వారా శరీరంలో అమర్చడం వల్ల బీపీ అదుపులో ఉంటుందట. ఇలాంటి సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు.

ఆర్‌ఓఎక్స్‌ కఫ్లర్‌ అనే ఒక పరికరాన్ని బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు తయారుచేశారు. పేపర్‌ క్లిప్‌ ఆకారంలో ఉండే ఈ పరికరం బీపిని నియంత్రిస్తుందని చెబుతున్నారు. ఈ లోహపు స్టెంట్‌లాంటి పరికరాన్ని కీహోల్‌ ఆపరేషన్‌ ద్వారా రోగి శరీరంలోని పొత్తికడుపు భాగంలో ప్రవేశపెట్టి అక్కడున్న ధమనిని, సిరను అనుసంధానిస్తారు. దీని ఫలితంగా హైబీపీ ఉన్న ధమని నుండి తక్కువ రక్తపోటు ఉన్న సిరకు రక్తసరఫరాకు ఎలాంటి అడ్డంకి లేకుండా సజావుగా సాగిపోతుంది. ఈ పరికరాన్ని తొలిసారిగా ఈనెల 16వతేదీన 56 ఏళ్ల ఒక పురుషుడిలో విజయవంతంగా ప్రవేశపెట్టామని బ్రిటన్‌లోని గ్లెన్‌ఫీల్డ్‌ ఆసుపత్రి వైద్యనిపుణులు తెలిపారు.

  • Loading...

More Telugu News